ఢిల్లీ గణతంత్రోత్సవంలో గుమ్మడిదల మహిళా పారిశ్రామికవేత్తకి గౌరవం

జాతీయ పరేడ్‌లో పాల్గొన్న మౌనిక ఉదయ్ కుమార్

ఢిల్లీ గణతంత్రోత్సవంలో గుమ్మడిదల మహిళా పారిశ్రామికవేత్తకి గౌరవం

గుమ్మడిదల, జనవరి 26(ప్రజాస్వరం):

ఢిల్లీలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన మహిళా పారిశ్రామికవేత్త, మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి మౌనిక ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక మహిళ జాతీయ కార్యక్రమాల్లో భాగమవ్వడం గుమ్మడిదల ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

దేశ ఐక్యత, సైనిక పరాక్రమం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మౌనిక, ఈ అనుభవం తనకు అపార గర్వాన్నిచ్చిందని తెలిపారు. దేశ అభివృద్ధి, సామాజిక మార్పులో మహిళల పాత్ర పెరుగుతుండటం ప్రేరణ కలిగిస్తోందన్నారు.

మహిళా సాధికారత, సామాజిక సేవల రంగాల్లో మైత్రి ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఈ జాతీయ అనుభవం మరింత ఉత్సాహాన్ని నింపిందని వెల్లడించారు. ఢిల్లీలో పొందిన అనుభవాలను గుమ్మడిదల ప్రాంత సామాజిక అభివృద్ధికి వినియోగించాలని సంకల్పించారు.