పదేళ్లు మెదక్ ను దోచుకున్నారు... 

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు....

పదేళ్లు మెదక్ ను దోచుకున్నారు... 

గతంలో ఇసుక దొంగతనం చేసిందే హరీష్ రావు...

ఎమ్మెల్యే రోహిత్ హయంలో మెదక్ అభివృద్ధి కి అడుగులు....

మెదక్ జనవరి 25 (ప్రజాస్వరం):

మెదక్ లో హరీష్ రావు సిరిసిల్ల లో బావమరిది దోపిడి లు చేశారనీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఆదివారం మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ లు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ముందుగా మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్ నుంచి వెంకటేశ్వర గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో మైనంపల్లి హనుమంతరావు బుల్లెట్ నడుపుతూ పాల్గొన్నారు. అనంతరం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతల నర్సింలు తో పాటు పలువురు చేరడంతో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ ఇటీవల మెదక్ వచ్చిన హరీష్ రావు ఛాలెంజ్ చేసాడంట అసలు ఇసుక దొంగతనం చేసిందే హరీష్ రావు అని ఎద్దేవా చేశారు. సహకార సంఘం లో అక్రమాలు చేపట్టిన చరిత్ర మీదనీ.. ఒక్కొక్కటి మీరు చేసిన అక్రమాలు బయటపెడతానని హెచ్చరించారు. గడిచిన పదేళ్ల లో మెదక్ లో ఉన్న ఆఫీసు లను సిద్దిపేట కు తీసుకునివెళ్ళి దోచుకోవడం జరిగిందని అన్నారు. సిరిసిల్లలో దళితులు ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ తో శిక్షించారనీ ఇంకా వారు కోలుకోలేదని వారు చేసిన అక్రమాలకు ఇది ఓ నిదర్శనమన్నారు. ఏడుపాయల ఆలయానికి, మెదక్ చర్చ్ కు కోట్ల రూపాయల నిధులు అందించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు హఫీజ్ ఉద్దీన్, మ్యాడమ్ బాలకృష్ణ, మధుసూదన్ రావు, రాగి అశోక్, బొద్దుల కృష్ణ, బొజ్జ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...