బానోత్ శ్రీనివాస్ నాయక్ నామినేషన్ దాఖలు...

బానోత్ శ్రీనివాస్ నాయక్ నామినేషన్ దాఖలు...

మేడ్చల్, (ప్రజాస్వరం):                                                      మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 9వ వార్డు నుండి బానోత్ శ్రీనివాస్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం డబిల్ పూర్ భారత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రంలో 9వ వార్డు సోమారం నుండి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బానోత్ శ్రీనివాస్ నాయక్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతోనే తాను ప్రజా సేవ చేసేందుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. 9వ వార్డు ప్రజలు తనను గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో పాండు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ప్రజల కోసం పనిచేసే తనను బిఆర్ఎస్ పార్టీ తరుపున కౌన్సిలర్ గా గెలిపించాలని శ్రీనివాస్ నాయక్ ఓటర్లను అభ్యర్థించారు.

Latest News

ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి... ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
జగదేవ్ పూర్,  ఫిబ్రవరి11(ప్రజాస్వరం):   పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....
రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....
పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....
115 దేశీదారు బాటిళ్లు స్వాధీనం....
భూ బాధితుల సమస్యను పరిష్కరించండి....