సీఎం కప్ మండల స్థాయి పోటీలు..
ఎంపీడీఓ ప్రీతి రెడ్డి
By Prajaswaram
On
నార్సింగి, జనవరి 28 ( ప్రజాస్వరం):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ దశ సీఎం కప్ 2025-26 కు సంబంధించి నార్సింగి మండలంలో మండల స్థాయి క్రీడోత్సవాలు జనవరి 29, 30, 31 తేదీలలో ఉ. 11 గం లకు నార్సింగి పట్టణ కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతాయని ఎంపీడీఓ వంగా ప్రీతీ రెడ్డి తెలిపారు. క్రీడల తేదీల గురించి తెలుపుతూ 29న రోజున వాలీబాల్ అండర్ 18 బాలురు, బాలికలకు పోటీలు, 30న కబడ్డీ పోటీలు మహిళలు, పురుషులకు, 31న ఖో ఖో అండర్ 18న బాలురు, బాలికలకు, అలాగే అదే రోజు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల లోని యువతీ యువకులు, బాల బాలికలు ప్రతి విభాగంలో పాల్గొనే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓ వంగ ప్రీతి రెడ్డి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Latest News
11 Feb 2026 16:43:43
జగదేవ్ పూర్, ఫిబ్రవరి11(ప్రజాస్వరం): పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ...


