రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....
వ్యవసాయ శాఖ అధికారులు....
పంట నమోదు చేయకపోతే నష్టం తప్పదు
దొమ్మాట రైతు వేదికలో పంట వివరాల నమోదు
దౌల్తాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజాస్వరం):
దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదిక పరిధిలోని, సూరంపల్లి, లింగరాజుపల్లి గ్రామ శివారుల్లో పొలాలు సాగు చేస్తున్న రైతులు తమ పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
ముఖ్యంగా పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసిన రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్‌తో పాటు హాజరై పంట వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం ద్వారా పంటల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు రైతుల వివరాలు సేకరిస్తున్నందున, సంబంధిత రైతులు రెండు రోజులలోపు వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్ (ఏఈఓ) వద్ద సమాచారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పంట వివరాలు నమోదు చేయని రైతులకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధి, కొనుగోలు కేంద్రాల సౌకర్యాలు అందకపోవచ్చని అధికారులు హెచ్చరించారు.
ఈ ప్రక్రియ దొమ్మాట రైతు వేదికలో నిర్వహించబడుతుందని, రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ సమాచారాన్ని తోటి రైతులకు తెలియజేయాలని కోరారు.


