కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...

మహేందర్ రెడ్డి ...

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...

తూప్రాన్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ లో వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు తో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కు వినతి పత్రాన్ని అందజేశం అని 

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు ఏ. మహేందర్ రెడ్డి తెలిపారు

 కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నశించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని రైతాంగ సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం తూప్రాన్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని వి.భ.జీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్, వివోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, ఆర్పీలు ,హాస్పిటల్ వర్కర్స్, భవన నిర్మాణ,హమలి కార్మికుల, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారికి కనీస వేతనం 26000 నిర్ణయించాలని ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వేతనాలు ఇవ్వాలని , వివో ఏ ఆర్ పి లకు. సెర్ఫ్ ద్వారా కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని అన్నారు, గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భావన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికుడికి కల్పించాలని కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్క కార్మికులు పోరాటంలో పాల్గొనాలని పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా ఉదయం నుండే తూప్రాన్ మండలంలో ఉన్న పలు పరిశ్రమలను బందు చేయించడం జరిగిందని ఆయన అన్నారు. పలు రంగాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో డీఏవో గారికి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఆగన్వాడీ యూనియన్ నాయకురాలు ఇందిరా, గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షులు మహేష్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి లక్ష్మి ఆర్ పిల యూనియన్ కార్యదర్శి విజయలక్ష్మి. వివో ఎలా యూనియన్ కార్యదర్శి కవిత, మున్సిపల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు బాబు ఎల్లం, యాదయ్య, నాగరాజు,సరితా, సురేష్, బలమని, సంపూర్ణ, శ్రీకాంత్ ,స్వామి,బాలయ్య, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....