సీఎం కప్ క్రీడలు ప్రారంభం......

తొగుట సీఐ లతీఫ్

సీఎం కప్ క్రీడలు ప్రారంభం......

 

 

దౌల్తాబాద్, జనవరి 30 (ప్రజాస్వరం):

క్రీడల ద్వారా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, గెలిచినవారు ఆనందించాలనీ, ఓడినవారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

అన్ని గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ కుమ్మరి రాజు, ఎంపీఓ వడ్ల శివకుమార్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రేకుల నరసింహారెడ్డి, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు స్వామి, ఉపాధ్యాయులు నాగరాజు, పీఈటీ గోవర్ధన్ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....