కాంగ్రెస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి...

స్వప్న నాగరాజు గౌడ్

కాంగ్రెస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి...

తూప్రాన్, ఫిబ్రవరి 1 (ప్రజాస్వరం ) :         

తూప్రాన్ పట్టణంలోని 12 వ వార్డు అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముని గారి స్వప్న నాగరాజు గౌడ్ అన్నారు. తూప్రాన్ పట్టణంలోని 12 వార్డులో ఆదివారం ఇంటింటి సర్వే చేపట్టారు. గెలిచిన కొంత కాలంలోనే తెలంగాణను అని విధాలుగా అభివృద్ధి పరిచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. తమ అమూల్యమైన ఓటును చేయి గుర్తుకు వేసి తమను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్, పోతారం సర్పంచ్ వినోద మహేందర్, ఉప సర్పంచ్ నరేందర్, వార్డు సభ్యులు సురేష్, యాదగిరి, నాగరాజు, ప్రశాంత్, రాకేష్, నాయకులు మల్లేష్, శేఖర్ రెడ్డి, లింగం యాదవ్, యాదగిరి యాదవ్, శుభాష్, కార్తీక, మల్లేష్, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.