ఇంటింటా ప్రచారం దూసుకెళ్తున్న.... టిఆర్ఎస్ పార్టీ

ఇంటింటా ప్రచారం దూసుకెళ్తున్న.... టిఆర్ఎస్ పార్టీ

తూప్రాన్, ఫిబ్రవరి 1 (ప్రజాస్వరం ): 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

 మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తరఫున 16 వార్డులలో ప్రచార రథలు బ్యాండ్ మేళాలతో ప్రచారం సాగించారు తూప్రాన్ పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం కేసీఆర్ పరిపాలన మాత్రమే అని బొంది అరుణ వెంకట్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు తప్పిందే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని ప్రజలు గమనించాలని 12వ వార్డుల ప్రచారం చేస్తున్న బొంది అరుణ వెంకట్ గౌడ్ తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన ఉందని ప్రజలు కారు గుర్తు కె ఓటు వేస్తాం అని ఆదరిస్తున్నారని చదువుకున్న అరుణకు అభివృద్ధి పథంలో12 వ నడపడానికి మీరు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు గతంలో 11వ వార్డులో కౌన్సిలర్ గా ఉండి 11వ వార్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానని అదేవిధంగా ఈ 12వ వార్డులో కూడా భారీ ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రజలకు హామీ ఇచ్చారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే తూప్రాన్ మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది ఆమె అన్నారు ఆసుపత్రి ఇంటింటా తాగు నీరు వ్యవసాయం కోసం సాగు నీరు అందించిన ఘనత కేసీఆర్ దే అని బొంది అరుణ వెంకట్ గౌడ్ అన్నారు