81 ఐఆర్ రిపోర్ట్ ల నమోదు..

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్...

81 ఐఆర్ రిపోర్ట్ ల నమోదు..

ఆపరేషన్ స్మైల్ విజయవంతం.

 సమిష్టి కృషితోనే బాల కార్మికుల వ్యవస్థ జిల్లాలో పూర్తిగా నాశనం.

 బాలలు బడులకి అంకితం కావాలని జిల్లా పోలీసుల పిలుపుతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం 

జిల్లా లో 85 మంది బాల కార్మికులకు విముక్తి.

 జిల్లావ్యాప్తంగా 35 కేసుల నమోదు

 79 బాలురు, 06 బాలికలను రక్షించిన యంత్రాంగం.

 24 బయటి రాష్ట్రాల బాలబాలికలను రక్షించిన ఆపరేషన్ స్మైల్ బృందం.

ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 01( ప్రజాస్వరం):

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్ పేరుతో జనవరి 1 నుండి 31 వరకు నెలరోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 85 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు మరియు వసతి గృహాలకు చేర్చి బాల కార్మికుల వ్యవస్థను నాశనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్ స్మైల్ నందు జిల్లావ్యాప్తంగా 85 మంది పిల్లలను రక్షించినట్టు అందులో 72 మంది పిల్లలను తల్లిదండ్రులకు 13 మంది పిల్లలను వసతి గృహాలకు తరలించి సొంత వారికి అప్పగించినట్లు తెలిపారు. 85 మంది పిల్లలలో 79 మంది బాలురు 06 బాలికలు ఉన్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు ఇందులో 24 మంది ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా జిల్లా వెల్ఫేర్ కమిటీ కార్మిక శాఖ, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, వైద్య శాఖ, మరియు ఎన్జీవోల సహకారంతో జిల్లాలో ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేసి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెస్క్యూ చేసిన వారిలో హోటల్లలో, భవన నిర్మాణాలలో, ఇటుక బట్టిలలో పనులలో ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అందజేసి అవగాహన కల్పించడం జరిగిందని బాలలను బడులకు పంపాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారికి విడతలవారీగా వారి సొంత స్థలాలకు చేర్చి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. చట్ట ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల రోజులపాటు కొనసాగిన ఈ ఆపరేషన్ స్మైల్ తో ఆగకుండా, సంవత్సరం పాటుగా బాల కార్మికులు కనబడినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.