బోర్ వెల్ యజమానుల సమ్మె….
నిలిచిపోయిన బోర్ వెల్ వాహనాలు
మేడ్చల్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం) :
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని బోర్ వెల్ వాహనాల నిర్వాహకులు జోనల్ వారీగా సమ్మె కొనసాగిస్తున్నారు . అందులో భాగంగా మేడ్చల్ జోన్ లో కూడా బోర్ వెల్ వాహనాలను ఒకచోట ఆపి సమ్మెను కొనసాగిస్తున్నారు. బోర్ వెల్ యజమానులు మాట్లాడుతూ డ్రిల్లింగ్ బిట్ల ధరలు విపరీతంగా పెరగడంతో యజమానులు లేబర్ లకు పేమెంట్లు కూడా చెల్లించలేక పోతున్నామని వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నామని పెరిగిన రేట్లు తగ్గేవరకు సమ్మె కొనసాగిస్తామని యజమానులు తెలిపారు. ఈ సమ్మెలో ఎస్బి బోర్ వెల్ నర్సింగారావు , ధనలక్ష్మి బోర్ వెల్ నాగరాజు, శివగంగ బోర్ వెల్ రామకృష్ణారెడ్డి, సాయి శ్రీనివాస బోర్ వెల్ శ్రీనివాసరెడ్డి, లక్ష్మి బోర్ వెల్స్ నరసింహ, సిద్ది రామేశ్వర బోర్ వెల్ తిరుమలేష్ , జాంగిర్, రాధాకృష్ణ బోర్ వెల్ , శ్రీశైలం, సాయి కృప బోర్ వెల్ మురళి , లింగం, లక్ష్మీ నరసింహ బోర్ వెల్ , నరసింహ, తదితరులు పాల్గొన్నారు.


