పాలన చేత కానీ సీఎం రేవంత్ రెడ్డి..
రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్
కాళ్లకల్ లో దిష్టి బొమ్మ దహనం
తూప్రాన్, ఫిబ్రవరి 1 (ప్రజాస్వరం):
ఫోన్ టైపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీస్ జారీ చేయడం పట్ల, సిట్ విచారణ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ర్యాకల శేఖర్ గౌడ్ తీవ్రంగా కండించారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో మండల బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి పరిపాలన సాధ్యం కాక, కెసిఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనవసరమైన విచారణల పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మహేశ్వర్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇంద్ర సేన యాదవ్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు వర్గాంటి రాజశేఖరరెడ్డి, గుజ్జుల స్వామి, మాజీ వార్డు మెంబర్ వెంకట్ యాదవ్, సీనియర్ నాయకులు మహ్మద్ అజాం, శ్రీధర్ చారీ, నరేందర్ గౌడ్, సెలవుద్దీన్, ఈశ్వరయ్య, బిక్షపతి, రాజు, ముజ్జా, దానయ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


