బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి...

గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి..

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి...

తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపల్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు నాయకులు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని గజ్వేల్  ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు,  తూప్రాన్ మున్సిపల్ ఇంచార్జ్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సతీష్ చారి తో కలిసి తూప్రాన్ లో 16 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా పని చేసి తూప్రాన్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జండా ఎగిరేలా చొరవ తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తూప్రాన్ అభివృద్ధికి పాటుపడిన తీరును, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ మాజీ ఆత్మ కమిటీ  గొర్రె వెంకట్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఏర్పల లక్ష్మణ్  చక్రవర్తి  రెడ్డి రఘుపతి బాలారాజ్ తదితరులు పాల్గొన్నారు