సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ

సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ

నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానం.
నేరల పరిశోదనకు, ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు.

జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు... 
సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ..

Read More ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన ఈవో ఎస్. వెంకట్రావు

మెదక్ జూలై 11 (ప్రజా స్వరం)

Read More కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానం అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణం నూతన బస్సు స్టాండ్ లో దాతల సహకారం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ  కెమెరాల ఏర్పాటు ద్వారా నేరలను అదుపు చేయవచ్చని, దొంగతనలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒక వెళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలను అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ  పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో, పట్టణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలిస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమనికి హాజరైన  ఆర్టీసీ సిబ్బంది కి సూచనలు చేస్తూ బస్సు డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ చూడడం గాని మాట్లాడంగాని చేయకూడదని చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఏమైనా అత్యవసరమైన కాల్ వస్తే వాహనాన్ని పక్కకు నిలుపుకొని మాట్లాడాలని తెలిపారు. బస్సు లో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అన్నారు. అదే విధంగా జిల్లాలో జరుగుతున్న ప్రమాదలకు ముఖ్య కారణం డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వలన జరిగినవెనని అన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విసృతంగా చేపడుతున్నమని అందులో భాగంగా ప్రతి రోజు 2 గంటలు ప్రతి పోలీస్ స్టేషన్  పరిధిలో తనిఖీలు చేపడుతున్నారని అన్నారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ కు పలు పడితే  జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు లో కీలకంగా వ్యవరించిన మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ను ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ ను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, దాతలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి

Latest News

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :   70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల...
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...