కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

ఖబర్దార్ కేటీఆర్...
మెదక్ ప్రజల మనోభావాలు దెబ్బతిస్తే సహించం...
కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.... 
బీఆర్ఎస్ హయాంలోనే వేధింపులు....
మెదక్ ప్రజలు గాడిదలన్న కేటీఆర్ తమ మాటలు ఉపసంహారంచుకోవాలి.... 

కేటీఆర్ పై ఎస్పీ కి పిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతల... 

Read More రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలి : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...

మెదక్ జూలై 10 (ప్రజా స్వరం)

Read More జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి : సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు

ఖబర్ధార్ కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతిసేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహారంచుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ భవన్ లో మెదక్ ప్రజలు గాడిదలన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ను కలిసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారం పోయినా బిఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ అని, దేశానికి స్వాతంత్యం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన వేధింపులకు నేటికీ కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ మెదక్ జిల్లా ప్రజలను గాడిదలతో పోల్చడం సరికాదన్నారు. తెలంగాణ లో మాట్లాడలేని భాషను క్రియేట్ చేసిందే కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వైపు సీఎం కృషి చేస్తుంటే ఓర్వలేక బిఆర్ఎస్ శ్రేణులు మతి బ్రమించి మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. ధనిక రాష్ట్రం ga ఉన్న తెలంగాణను  అప్పుల కుప్పగా మార్చింది బిఆర్ఎస్ సర్కార్ కదా అని వారు ప్రశ్నించారు. మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి ఫ్యామిలీ అంటేనే సేవ చేసే ఫ్యామిలీ అని వారిని విమర్శిస్తే సహించేదిలేదని వారు హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెపుతామని వారు తెలిపారు. మెదక్ నియోజకవర్గం లో అవినీతి కి పాల్పడి వందల ఎకరాల భూములు, వందల కోట్లు ఎవరు సంపాదించారో మెదక్ ప్రజలకు తెలుసన్నారు.వెనుక పడేసిన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకేళ్లేందుకు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ కృషిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీనివాస్ చౌదరి, బొజ్జ పవన్, , ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, లక్కర్ శ్రీనివాస్ ఆంజనేయులు గౌడ్, ముత్యం గౌడ్, గంగాధర్,రాగి అశోక్, లల్లూ, లక్ష్మీనారాయణ, దుర్గ ప్రసాద్, మహేందర్ రెడ్డి, శంకర్, లింగం, శ్రీకాంత్, బొద్దుల క్రిష్ణ, రమేష్ గౌడ్, బానీ తదితరులు ఉన్నారు.

Read More అత్యవసరంగా విమానం ల్యాండింగ్

Latest News

తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లిహైదరాబాద్, (ప్రజాస్వరం ) :  తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌ శివారులో చోటు చేసుకుంది.  ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌...
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.
గురు పౌర్ణమి మహోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు