బెట్టింగ్ లకు అలవాటు పడి చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...
బెట్టింగ్ అలవాటుతో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం..
జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...
మెదక్ జూలై 08 (ప్రజా స్వరం)
బెట్టింగ్ అలవాటు పడిన వ్యక్తి మరి కొందరితో కలిసి చోరీ లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన లో సంబంధించిన మీడియా సమావేశం మంగళవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మెదక్ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన శివకుమార్, తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి, మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు అభినందించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్,డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.