మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్ (ప్రజాస్వరం ) : 

Read More పదోతరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన బండి సంజయ్ 

 రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో హోర్డింగ్ల ఏర్పాటులో ద్వంద్వ నిబంధనలు పాటిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎంఏ యూడీ ముఖ్య కార్యదర్శి, మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, అసి స్టెంట్ కమిషనర్ (ప్రకటనలు) తదితరులకు నోటీసులు జారీ చేసింది.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 15 అడుగుల కంటే ఎత్తున్న అన్ని ఎస్ఈడీ హోర్డింగ్లను తొల గించాలని ప్రభుత్వం జీవో 68 జారీ చేసింది. తొల గింపు చర్యలను నిలిపివేయాలని కోరుతూ 2024, జనవరి 25 నుంచి 2025, జూన్ 26 వరకు 19సార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ తెలంగాణ ఔట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సహా 53 ప్రకటన సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కొన్ని ప్రకటన సంస్థలకు ఇచ్చిన సడలింపును తమకు అమలు చేసేలా అధికారులను ఆదేశిం చాలని కోరారు. ఈ పిటిషన్ జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. 'ఎంపిక చేసిన కంపెనీలకు సడలింపు ఇవ్వడం చట్ట బద్ధంగా అన్యాయం. పిటిషనర్ అసోసియేషన్, దాని సభ్యులు మున్సిపల్, రాష్ట్ర చట్టాలను కచ్చితంగా పాటిస్తున్నారు. జీహెచ్ఎంసీ, పట్టణ స్థానిక సంస్థలకు ప్రకటన రుసుములలో ఏటా కోట్లాది రూపాయలను చెల్లిస్తోంది. రాష్ట్రంలో లక్ష మందికి పైగా వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. వీరిలో కొందరికి ఒకలా.. మరికొందరికి మరోలా నిబంధనలు వర్తింపజేయడం సరికాదు. పిటిషనర్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రాలపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలి. 15 అడు గుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్ల ఏర్పాటుకు అనధికారిక ప్రతివాదులకు ఇచ్చిన సడలింపులను పిటిషనర్లకు వర్తింపజేయాలి' అని కోరారు. వాద నలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ ఆగస్టు 6కు వాయిదా వేస్తూ ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది విచారణ వాయిదా వేశారు

Read More బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.

Latest News

తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లిహైదరాబాద్, (ప్రజాస్వరం ) :  తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌ శివారులో చోటు చేసుకుంది.  ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌...
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.
గురు పౌర్ణమి మహోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు