రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
పథకాలు సాధించిన సిబ్బంది కి రివర్డ్ మంజూరు.
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి.
జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
మెదక్ జూలై 08 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం లో సోమవారం పథకాలు సాధించిన సిబ్బంది నీ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ కు సెలెక్ట్ కావాలని అన్నారు. మెడల్ సాధించిన సిబ్బందికి రివర్డ్ మంజూరు చేశారు. యాక్సెస్ కంట్రోల్ విభాగం లో పోలీస్ కానిస్టేబుల్ దుర్గ ప్రసాద్, సిద్ధి రాములు ఇద్దరికి బంగారు పథకం వచ్చిందని,ఏఎస్సి గ్రౌండ్ సెర్చ్ ఈవెంట్ విభాగంలో ఏఆర్ హెచ్సి రవీందర్, పీసీ నర్సిములు రెండవ స్థానంతో వెండి పథకం వచ్చిందని అన్నారు. కంప్యూటర్ అవేరేన్స్ విభాగం లో పీసీ సతీష్ రావు మొదటి స్థానం పొంది బంగారు పథకం వచ్చిందని అన్నారు. అదే విధంగా కంప్యూటర్ ఆటోమేషన్ విభాగం లో కూడా మూడవ స్థానం సాధించారని అన్నారు. సైంటిఫిక్ ఎయిడ్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ విభాగంలో పీసీ అశ్వాక్ మూడవ స్థానం సాధించారని తెలిపారు. ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ విభాగం లో పీసీ శ్రీధర్ గౌడ్ రెండిటిలో మొదటి స్థానం సాధించి 2 బంగారు పథకాలు కైవసం చేసుకున్నారని, డాగ్ స్క్వాడ్ నార్కో టిక్ విభాగం లో పీసీ శ్రవణ్ కుమార్ మూడవ స్థానం పొందరని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఆర్ ఐ శైలందర్, సిబ్బంది పాల్గొన్నారు.