బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : మైనంపల్లి హన్మంత్ రావు
మీడియా పై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదు
తూప్రాన్ / మనోహరాబాద్ ( ప్రజాస్వరం) :
మీడియాపై దాడులు చేస్తామంటే సహించేది లేదని చేస్తే తెలంగాణ సెంటిమెంట్ ను వారి అవసరానికి వాడుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మనోహరాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాఫుతూ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ, ఆంధ్ర విభేదాలు మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ సంక్షోభంలో పడగానే ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. వ్యక్తులు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ తెలంగాణలో పుట్టిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అని, వారు తెలంగాణలో ఉండొద్దా..? ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తారా..? అని నిప్పులు చెరుగారు. ఏబీఎన్ రాధాకృష్ణ మీడియాకు మా కార్యకర్తలు, మేము అండగా ఉంటామన్నారు. ఎవరైనా దాడులు చేస్తే బట్టలు ఊడదీసి ఊరికే దాకా కొడతాం అని హెచ్చరించారు. ఎప్పుడో బీహార్ నుంచి వచ్చిన రావులే సత్యమైన తెలంగాణ వాదులా..? మరి ఇక్కడ పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏమీటన్నారు. మీ రాజ్యమా..? అంతా మీ ఇష్టమా..? అని బీఆర్ఎస్ నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతూ ఎగురుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరి ఆరోజు మీడియాకు ఆంక్షలు పెట్టిన విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాదన్నారు.