ఘనంగా వైఎస్ఆర్ జయంతి

ఘనంగా వైఎస్ఆర్ జయంతి

మేడ్చల్ (ప్రజాస్వరం) :

Read More సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలు మేడ్చల్ లో ఘనంగా జరిగాయి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మేడ్చల్ చెక్ పోస్ట్ లో  గల మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై వై ఎస్ ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ మాట్లాడుతూ మాట తప్పని,మడమ తిప్పని,ఓటమెరుగని మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప మహానుభావుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు విద్యుత్ బకాయిలు మాఫీ,రైతులకు రుణ మాఫీ,రైతాంగానికి సరైన సమయంలో సబ్సిడీ విత్తనాలు అంద నేయడం తో పాటు మహిళలకు పావుల వడ్డీ రుణాలు,వృద్ధులకు వితంతులకు అర్హులైన వారందరికీ ప్రతి నెల పింఛన్,వికలాంగులకు పింఛన్,అభయ హస్తం పింఛన్ లు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం,జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టి లక్షలాది ఎకరాలకు రైతాంగానికి సాగునీరు అందించిన మహాను వావుదని కొనియాడారు. 108 అత్యవసర అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి వందలాదిమంది నిరుపేదల ప్రాణాలు కాపాడినారు,104 అంబులెన్స్లు ఏర్పాటు చేసి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయించినారు,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలు పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే విధంగా చేసినారు,*ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) కింద లక్షలాదిమంది నిరుపేదలకు కోట్లాది రూపాయలు అందించారు,రాష్ట్రంలో అవసరం ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినారు,ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదివి కలెక్టర్లు,డాక్టర్లు,ఇంజనీర్లు,ఇంకా తదితర రంగాలలో రాణించాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినారు,ఇందిరమ్మ ఇండ్ల పథకంతో రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టించినారు,రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసి న గొప్ప నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాహుల్ యాదవ్,మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుర్గం శివ శంకర్ ముదిరాజ్,రేగు రాజు కురుమ,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం ‌సత్యనారామణ,మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ శ్రీ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పెంజర్ల స్వామి యాదవ్,కౌడే మహేష్ కురుమ,రొయ్యపల్లి మల్లేష్ గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్ సి సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ (చింటు),మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఆరీఫ్,బట్టు మధు,మాజీ ఉప సర్పంచ్లు బొక్క రఘుపతి రెడ్డి,మర్రి నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్ గౌడ్,కనకాల నాగభూషణం,రామన్నగారి సంతోష్ గౌడ్,సుదర్శన్ రెడ్డి,కనకాల శివ కుమార్,చంద్రయ్య గౌడ్,నర్సింహ్మ రెడ్డి,నడికొప్పు రంజిత్ ముదిరాజ్,వరధా రెడ్డి,కాలేరు శ్రీకాంత్ వంజరి,ప్రకాష్ రెడ్డి,మేకల రాజశేఖర్ రెడ్డి (బబ్లూ),గర్ధాస్ నరేందర్,పత్తి శంకర్,మురళీ గౌడ్,వేముల రంజిత్ రెడ్డి,టైలర్ రాజు గౌడ్,పాషా,మేడ్చల్ మున్సిపాలిటీ,ఉమ్మడి మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

Latest News

సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానం.నేరల పరిశోదనకు, ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు....
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.