రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ (ప్రజాస్వరం ) : 

 70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీల విజయమని బీసీ ల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు అయ్యేంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీం  కోర్టులలో ఎవరైనా కేసులు వేస్తే ప్రభుత్వానికి ముందుగా నోటీసులు వచ్చే విధంగా కెవిఎట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.42 శాతం రిజర్వేషన్ ప్రక్రియను అసెంబ్లీలో బిల్లును పెట్టి ఆమోదిస్తే చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్నారు. అన్ని అనుకూలంగా ఉన్న ఈ సమయంలో రిజర్వేషన్లపై ఏదైనా ఆటంకం ఏర్పడితే బీసీలంతా తిరగబడే అవకాశం ఉందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి రావాలన్నదే మా ఆకాంక్ష అని అన్నారు.

Read More శ్రీశైలం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ 

Latest News

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :   70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల...
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...