రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం
By Prajaswaram
On
రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం
ప్రజాస్వరం బ్యూరో :
రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు.. భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
10 Jul 2025 22:01:45
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లిహైదరాబాద్, (ప్రజాస్వరం ) : తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్...