దేశం కోసం పని చేస్తూనే ఉంటాం : బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్

 దేశం కోసం పని చేస్తూనే ఉంటాం : బీజేపీ  ఎంపీ  డాక్టర్ కె. లక్ష్మణ్

నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయిన డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్  ( ప్రజాస్వరం ) :  
బీజేపీ  ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్  నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ లోని  దోమలగూడ పోలీస్ స్టేషన్ సూర్యపేట పోలీస్ స్టేషన్ లలో  కేసులు నమోదులో భాగంగా బుదవారం అయన నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  భాజపా ప్రభంజనాన్ని ఎదుర్కోలేక, అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం మరియు నాయకులు రాచరిక విధానంలో తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. వేధింపుల నేపథ్యంలో, వేలాది మంది భాజపా కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందేనాని  ఇప్పుడు అదే మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోందని నారు. మేము నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశం కోసం పనిచేస్తున్న నిబద్ధత గల కార్యకర్తల మని  న్యాయస్థానాల పట్ల, ధర్మం పట్ల మాకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. బీఆర్ఎస్  కాంగ్రెస్ పార్టీల కక్ష సాధింపు చర్యలకు లొంగకుండా, మేము దేశం కోసం పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

Latest News

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :   70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల...
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...