వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం : మెదక్ ఎంపీ రఘనందన్ రావు
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం : మెదక్ ఎంపీ రఘనందన్ రావు
గజ్వేల్ / కుకునూర్ పల్లి (ప్రజాస్వరం) :
వచ్చే స్తానిక సంస్థల ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మెదక్ ఎంపీ రఘనందన్ రావు అన్నారు. దానికి ఉదాహరణ ఎంపీ ఎన్నికల్లో మండలం లో ఓటింగ్ శాతం ఎక్కువగా రావడమే అన్నారు మండలం లో గెలుపు దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు . జిల్లా బీజేపీ అధ్యక్షులు భైరి శంకర్ ముదిరాజ్ , మండల పార్టీ అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కుకునూరు పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పునూరి వీరేశం, బీఆర్ఎస్ పార్టీ నుండి ముషణం, నాగరాజు గౌడ్ లతో పాటు వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున యువత ముఖ్య నాయకులు తిప్పరం,బోబైపల్లి, లకూడారం, మాత్పల్లి, రాయవరం, చిన్నకిష్టాపూర్,గ్రామాలలో నుండి కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల నుండి ఎంపీ సమక్షంలో బీజేపీ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ కుకునూర్ పల్లి. మండలం లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లకు భవిష్యత్తు లేదన్నారు. సందర్భంగా వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంత కృషి చేసిన కృషి తగ్గ గుర్తింపు లేకుండా పోయింది అని అన్నారు. 20 ఏళ్లుగా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం మండలం లో కష్టపడుతున్నా తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కుకునూర్ పల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు కాంగ్రెస్ ను నమ్ముకున్న కార్యకర్తలకు నష్టం జరిగే విధంగా ఉంది అని అన్నారు బీజేపీ విధివిధానాలు నచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు నచ్చిఅవసరమని భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కుకునూర్పల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు నంద కిషోర్ శర్మ ,జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.