ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ఇందిరమ్మ ఇల్లు ఎంపిక పారదర్శకంగా చేయాలి....
మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి నీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు విషయంలో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో, నిజమైన అర్హులైన పేద కుటుంబాలు ఈ పథకం లబ్ధిని పొందలేకపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ మద్దతుతో ఎంపికలు జరుగుతున్నందున ఇది అన్యాయంగా మారిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెదక్ మరియు సిద్దిపేట మున్సిపాలిటీ లో నిజమైన లబ్ధిదారుల జాబితాను మంత్రి కి అందజేసిన రఘునందన్ రావు, వారికి న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.