ప్రధాని మోడీ ఎంపీ రఘునందన్ రావుచిత్ర పటాలకు పాలాభిషేకం

ప్రధాని మోడీ ఎంపీ రఘునందన్ రావుచిత్ర పటాలకు పాలాభిషేకం

ఎంపీ, పీఎం చిత్రపటాలకు పాలాభిషేకం....

మెదక్ జూలై 19 (ప్రజా స్వరం)

Read More బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...

మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఎంపీ రఘునందన్ రావు కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా వద్ద శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ, రఘునందన్ రావు ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ దుండిగల్ రింగ్ రోడ్డు నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు నాలుగు లైన్ల హైవే రోడ్డు, మెదక్ పట్టణానికి రింగు రోడ్డు మంజూరైన సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేయడం జరుగుతుందని అన్నారు.   రింగ్ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడం జరుగుతుందని అన్నారు. మెదక్, నర్సాపూర్ రోడ్డు ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించిన ఎంపీ రఘునందన్ రావు ఈ నాలుగు వరసల రోడ్డు తో ప్రమాదాలను నియంత్రించవచ్చని సదుద్దేశంతో ఈ రోడ్డు కోసం ఆయన అందరినీ ఒప్పించి తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ఈ రోడ్ల మంజూరు కు కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావుకు మెదక్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మండల అధ్యక్షురాలు బెండ వీణ, నాయకులు శివ, విఠలేష్, రాము, రంజిత్ రెడ్డి,ఏసురెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు