బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే ఆలయాల అభివృద్ధి : మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే ఆలయాల అభివృద్ధి : మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట (ప్రజాస్వరం ) :
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఒక్క కొత్త ఆలయం కు కూడా నిధులు ఇవ్వలేదని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మంజూరు పత్రాలు తీసుకొచ్చానని నియోజకవర్గంలోని నాలుగు దేవాలయాలకు 1కోటి 48 లక్షలు మంజూరు చేయించానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆలయాల ప్రతినిధులకు, గ్రామాల ప్రజలకు నిధుల మంజూరు పత్రాలని అందజేసిన అయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నే ఆలయ అభివృద్ధి కి ప్రతిపాదనలు పంపి, ప్లాన్స్ ఎస్టిమెట్స్ వేసి అప్రూవల్ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం లో ఆలయాలకు పూర్వ వైభవమ్ తెచ్చామని, ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయిన ఒక్క కొత్త ఆలయాలనికి నిధులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గం లో శివాలయం రాజ్ గోపాల్ పేట్ 35లక్షలు
బీరప్ప టెంపుల్ - అనంత సాగర్ - 32లక్షలు ,సీతా రామ చంద్ర స్వామి టెంపుల్ - రాఘవా పూర్ 36 లక్షలు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం - రావూరుకుల 50లక్షలు మొత్తం గా కోటి 48 లక్షలు మంజూరు చేసుకున్నామని చెప్పారు.. ఈ సందర్బంగా గ్రామాల ప్రజలకి ఆలయాల ప్రతినిధులకు మంజూరు పత్రాలను అందజేశారు త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభం చేసేల కృషి చేస్తానని చెప్పారు.