మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
*మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం:ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి*
శామీర్ పేట జూలై 17, (ప్రజా స్వరం) :రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం శామీర్ పేట మండలంలోని అలియాబాద్‌లోని శుభం పంక్షన్ హాల్‌లో సెర్ప్, మెప్మా ఆద్వర్యంలో స్వయం సహాయక సంఘాలు సభ్యులతో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి ముఖ్యతిథిగా పాల్గొన్నారు. బ్యాంక్ లింకేజీ కింద 619స్వయం సహాయక సంఘాలకు రూ. 38 కోట్ల 86 లక్షలు, 5 మండలాలకు 3698 స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు వడ్డీ రాయితీ కింద కోటి 79 లక్షలు, 5 మంది మహిళలకు లోన్ భీమా కింద 3 లక్షల19 వేల విలువగల చెక్కుల మేడ్చల్ శాసభ్యులు సిహెచ్. మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ మిక్కినినేని మను చౌదరిలతో కలిసి చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీలో ఆడబిడ్డకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు బస్సులిచ్చి కిరాయికి ఇచ్చే విధంగా అవకాశం కల్పించామని, 200 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. అలాగే జిల్లా కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంక్ లు నడిపించే బాధ్యత అప్పగించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో వాటిని నిర్వహించే బాధ్యత ఇచ్చాం. గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి రూ. 5 లక్షల వరకు అందిస్తున్నామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయటకు దృడ సంక్పంతో రాష్ట్ర ప్రభుత్వము అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు ఇచ్చి వారు వ్యాపార రంగంలో రాణించే విధంగా కృషి చేశామని ఆయన తెలిపారు. గతంలో మహిళలను లక్షాదికారులను చేయాలని లక్షం కాగా ప్రస్తుత ప్రభుత్వము కోటీశ్వరులను చేయాలని కృత నిశ్చయంతో పని చేస్తుందని తెలిపారు. ఇందుకు అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరేందుకు ప్రస్తుతం ఉన్న సభ్యులు, సంఘాంలో చేరితే వచ్చే లాభాలగురించి క్షుణ్ణంగా వివరించి నూతన సభ్యులకు సభ్వత్యం కల్పించాలని సూచించారు. మహిళలు నిర్ధిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని అందుకు తగిని విధంగా ప్రణాళికను సిద్దం చేసుకుని, లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడాలని ఆయన తెలిపారు. చిన్న వ్యాపారమే కదా అని అనుకోకుండా, నిరంతరం కృషి చేస్తే మున్ముందు ప్రగతి సాధించడం పెద్ద కష్టం కాబోదని, తద్వారా ఆర్ధికంగా ఎదుగుటకు దోహదపడుతుంది ఆయన సూచించారు. ఈ సందర్భంగా చామకూర మాల్లారెడ్డి మాట్లాడుతూ... దైర్యే సహాసే లక్ష్మి, ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు 36 వేల స్యయం సహాయక సంఘాలలో సభ్యులు ఉన్నారని, అర్హులైన మహిళలందరిని స్వయం సహాయక సంఘాల గ్రూపులలో చేర్పింటకు కృషి చేయాలన్నారు. మహిళల స్వాలబన కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయలు రుణాలు అందించి వారి ఆర్ధిక ఎదుగుదలకు కృషి చేస్తుందని సూచించారు. ప్రపంచ దేశాలలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ యం.మను చౌదరి మట్లాడుతూ... మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువును అమ్ముకొనుటకు ప్రభుత్వ అవకాశాలు కల్పిస్తుందని, తద్వారా వచ్చే లాభాలను వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాని చెప్పారు. ఇంట్లో బాధ్యతలు నిర్వహణలో మహిళలే రోల్ మోడల్‌గా ఎదుగుతున్నారని, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందిన సభ్యులకు వ్యాపారం చేసేందుకు కావల్సిన శిక్షణలు ఇస్తామని తెలిపారు. వారు ఎ రంగంలో కావాలంటే ఆ రంగంలోనే శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ మహిళ ఆర్ధిక అవృద్ధికి పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ కమీటీలు బాధ్యత కూడా మహిళలకు అప్పగించామని అన్నారు. పాఠశాలలో యూనిఫామ్స్ కుట్టుటకు వారికే అప్పగిస్తే నిర్ధేశించిన సమయంలోపు బట్టలను కుట్టి అప్పగించడం అభినందనియమని ఆయన అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఐకేపి సంఘాల కు వడ్ల కొనుగోలులో ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందితే వారి కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం మొత్తం బాగుంటదని ఆయన వివరించారు. అత్యదికంగా మహిళలు పనిచేస్తున్న దేశాలు అభివృద్ధిలో కొనసాగుతున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళా సంఘాల ద్వారా లబ్దిపొందిన మహిళా సభ్యులు తమ తమ అనుభవాలను తెలియజేసారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారధులు ఇందిరా మహిళా శక్తిపై పాడిన పాటలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ నర్సింహులు యాదవ్, గ్రందాలయ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఇంచార్జీ డిఆర్‌డిఓ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షులు అజయలక్ష్మి, తహాశీల్దార్, యంపిడిఓ, అలియాబాద్ మున్సిపల్ కమీషనర్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సెర్ప్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.