ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా

ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలు విడుదల లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి..

ఆర్డీవో కి వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు..

Read More  42 కిలోల గంజాయి పట్టివేత

మెదక్ జూలై 16 (ప్రజా స్వరం)

Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్డీవో రమాదేవి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాల కాలంగా ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ 8145 కోట్ల బకాయిలు విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ అనేది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించడానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఎవరి బిక్ష కాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నత విద్య అందుకుని ఈ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండటం ద్వారానే ఈ సమాజాభివృద్ధి సాధిస్తుంది అన్నారు. భారత దేశంలోనే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం కేవలం తెలంగాణ  రాష్ట్రం అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బకాయిలను విడుదల చేయాలని లేకపోతే రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ బాధ్యులు అజయ్ టౌన్ కార్యదర్శి కార్తీక్, నాయకులు బస్వలింగం, నితిన్, రాజు, కిరణ్, రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...