మెదక్ లో సందడి చేసిన నటినటులు
మెదక్ లో సందడి చేసిన సినీ నటి వైష్ణవి చైతన్య...
హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు...
చూసేందుకు భారీగా జనం...
మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)
నూతనంగా మెదక్ పట్టణంలో నిర్మించిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ను జబర్దస్త్ ఫేమ్ వర్ష తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు హాజరుయ్యారు. షాప్ యజమానులను అభినందించారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వస్తున్న సమాచారంతో ప్రజలు భారీగా షాపింగ్ మాల్ వద్ద చూసేందుకు ఎగబడ్డారు. షాప్ ప్రారంభిన తర్వాత షాప్ లో తిరిగి పరిశీలించారు. మెదక్ పట్టణంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ లో నూతనంగా ప్రారంభించిన షాపింగ్ మాల్ లాభాల బాటలో సాగుతూ మరింత ఎదగాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జబర్దస్త్ నటులు ఫేమ్ వర్ష, ఫైమా, నూకరాజు, రైజింగ్ రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.