మెగా ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని  ప్రారంభించిన మంత్రులు తుమ్మల ,పొన్నం

మెగా ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని  ప్రారంభించిన మంత్రులు తుమ్మల ,పొన్నం

ఆయిల్ ఫాం మొక్కలు నాటిన మంత్రులు తుమ్మల ,పొన్నం
 
సిద్దిపేట  / కోహెడ (ప్రజాస్వరం ) :  

ఆయిల్ ఫాం సాగు పై రైతులు దృష్టి పెట్టాలని అధిక లాభాలు సాధించే పంట అని ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీ పంట నుండి ఫ్యాక్టరీ వరకు రవాణా ఖర్చు వారే భరిస్తారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు. పొన్నం ప్రభాకర్ లు అన్నారు. సిద్దిపేట జిల్లా  కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని  ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ ఈ భూమిలో రామారావు ఇప్పటికే 30 ఎకరాల ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని  ఇప్పుడు మరో 50 ఎకరాల్లో మెగా ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని తెలిపారు. ఆయిల్ ఫాం సాగు పంట ను నర్మేట లో ఉత్పత్తి ప్రారంభం అయిన తరువాత ఇక్కడే తీసుకుంటారని తెలిపారు. ఈ పంట సాగుతో కోతుల బెడద ఉండదు అకాల వర్షాల ఇబ్బందులు ఉండవని రైతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్ ఫాం సాగు చేయాలని కోరారు. మన దేశంలో ఆయిల్ ఫాం సాగు తక్కువగా ఉండడం వల్ల లక్షల కోట్ల విలువైనవి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. రైతుల ఆకాంక్షల కు అనుగుణంగా మంచి ధరతో ఆయిల్ ఫాం కొనుగోలు చేస్తారన్నారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో ఆయిల్ ఫాం సాగు మంచి దిగుబడి వెచ్చెల చూసుకోవాలనో కోరారు. ఇటీవల గుజరాత్ లో అమూల్ పాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అయ్యే కేంద్రాన్ని చూసానని వారు కురియన్ క్షీర విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ  ఆయిల్ ఫాం పై మంచి అనుభవం ఉందని  30 సంవత్సరాలుగా ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారన్నారు. మా ప్రాంతంలో కూడా ఆయిల్ ఫాం సాగు చేయాలని 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశా వారికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. హుస్నాబాద్ లో ఒక్క గుంట భూమి కూడా వృధా గా ఉండవద్దని గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చే బాధ్యత నాది అని  అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫాం కార్పోరేషన్ చైర్మన్  జంగా రాఘవ రెడ్డి , హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

 

Read More మేడ్చల్ లో అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

Latest News

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...
ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
42 కిలోల గంజాయి పట్టివేత
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు