మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా....: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా....: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా....
కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ ఆస్తులను దోచుకుంది... 
బనకచర్ల నీటి వాటా విషయంలో సంతకం పెట్టింది ఎవరు.... 
మెదక్ జిల్లా ను అభివృద్ధి చేసి తీరుతాం....
కవిత కు బీసీ రిజర్వేషన్ కు సంబంధం ఏంటి.... 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

Read More ప్రధాని మోడీ ఎంపీ రఘునందన్ రావుచిత్ర పటాలకు పాలాభిషేకం

కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ..  
కాంగ్రెస్ పార్టీ లో చేరిన ప్రముఖ సంఘ సేవకుడు మోహన్ నాయక్... 

Read More మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష

మెదక్ జూలై 16 (ప్రజా స్వరం) :

Read More మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించి, మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా లా ఇప్పుడు మారిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకుడు మోహన్ నాయక్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని అన్నారు. భవిష్యత్లో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనీ అన్నారు. ముందుడి పోరాడారని కేసీఆర్ ను సీఎం చేస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో దుష్ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఆనాడు బీ అర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బానకచర్ల నీటి విషయంలో సంతకం పెట్టీ అప్పటి మంత్రి హరీష్ అని, ఇప్పుడు మళ్లీ బనకచర్ల విషయం మీకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. అబద్ధాలు చెబుతూ బీ అర్ ఎస్ పార్టీ ఇప్పటి వరకు రాజకీయాలు చేస్తుందన్నారు.  బానకచర్ల పై మాట్లాడదాం అంటే సీఎం రేవంత్ సిద్ధమని చెబితే కేసీఆర్, హరీష్ రావు మాట కూడా మాట్లాడకుండా తప్పించుకున్నారని అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, వచ్చే ఎన్నికల నాటికి బీఅర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండదని అన్నారు. మా మంత్రుల కృషి తో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లో ముందుకు సాగుతుందని అన్నారు. మెదక్ జిల్లా ను, మెదక్ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసి తీరుతాం అన్నారు. మీ కళ ను ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత మాది అన్నారు. బీసీ ల రిజర్వేషన్ల కవిత కు ఏం సంబంధం, గతంలో మీరు అధికారంలో ఉన్న బీసీ ల 42% రిజర్వేషన్ల ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర లో దేశంలోని ప్రజల సాంఘిక, బౌగోలిక పరిస్థితులను అర్ధం చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతో ఓట్లు ఆడుకుంటున్నారని, మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లను అంటగడుతుందని అన్నారు. బీజేపీ కి శ్రీరామచంద్ర స్వామికి సంబంధం లేదు కానీ వాళ్లు దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటున్నరాని అన్నారు. చదువుకున్న మేధవులు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తోందని అన్నారు. ఏడుపాయల అమ్మవారికి, మెదక్ చర్చ్ కు నిధులు కేటాయించినా ఘనత కాంగ్రెస్ దే అన్నారు.

Read More ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

లక్షల కోట్లు దోచుకున్నారు :  మంత్రి వివేక్ వెంకట స్వామి

Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ మెదక్ ప్రజల ప్రేమ తో ఏంతో సంతోషంగా ఉందనీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేస్తుందని, సన్నబియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని అన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు అన్నారు. రేవంత్ నేత్రత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ ను లూటి చేసింది కెసిఆర్, హైదరాబాద్ లో భూములు, కాంట్రాక్టుల్లో కమిషన్లు తీసుకోని లక్షల కోట్లు దోచుకున్నారాని అన్నారు. 

మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాం :  ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు

ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు మాట్లాడుతూ గత పదేండ్లు ప్రజలను కేసీఆర్ కుటుంబం ఆగం పట్టించిండ్రు అన్నారు. గత సీఎం కేసీఆర్ ఏడుపాయల వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇచ్చింది ప్రజా పాలన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గతంలో ఎవరు కూడా పేదలకు ఇల్లు ఇవ్వలేదని, తాము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి ప్రస్తుతం ఇస్తున్నామని ప్రతి గ్రామంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. గత పడేండ్ల లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలె కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డు లను ఇవ్వడం జరిగిందని అన్నారు. గతంలోనే మెడికల్ కాలేజీ తెస్తున్నారని చెప్పి కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే మెదక్ కు మెడికల్ కాలేజీ ని తాము తీసుకుని వచ్చి ప్రారంభించి ప్రస్తుతం విద్యాభ్యాసం కూడా జరుగుతుందని అన్నారు. మేము ఏది కూడా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పూజల హరికృష్ణ, నర్సాపూర్ ఇంచార్జీ రాజిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...
ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
42 కిలోల గంజాయి పట్టివేత
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు