స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భాజపాను గెలిపించాలి : ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, (ప్రజాస్వరం) :
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు గెలవాలని అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్య చాలా కార్యక్రమం జరిగింది. జిల్లా స్థానిక ఎన్నికల ప్రబారి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్. ఎస్ ప్రభాకర్ , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలిచేందుకు అవసరమైన అంశాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలు అందించాలని తెలిపారు. పార్టీ అభ్యర్థులు గెలిచాక ఏం చేస్తామో వారికి వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో జాప్యంపై ప్రజలకు తెలిసేలా వివరించాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఎంత నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలోని ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు పాల్గొన్నారు.