దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 
నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యుడిఐడి కార్డ్స్ జారీ
రోగులకు అవసరమైన వైద్య సేవలు అందజేస్తాం...

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

మెదక్ జూలై 16 (ప్రజా స్వరం)

Read More ప్రధాని మోడీ ఎంపీ రఘునందన్ రావుచిత్ర పటాలకు పాలాభిషేకం

దివ్యాంగుల అభ్యర్థన మేరకు మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం యూడిఐడి కార్డు జారీ చేయు ప్రత్యేక క్యాంపు ను, ప్రభుత్వ ఆసుపత్రి  కార్యకలాపాలను క్యాంపులో దివ్యాంగులను పలకరిస్తూ, ఫిజియోథెరపీ యూనిట్, వృద్ధుల విభాగం రోగులతో మాట్లాడి వారి వైద్య సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి మరియు ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డు ను జారీ చేయడానికి వికలాంగుల కోసం ప్రత్యేక ఐడీ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందని ఇందులో భాగంగానే మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గడిచిన నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యుడిఐడి కార్డ్స్ జారీ చేయడం జరిగిందని, స్లాట్ బుక్ చేసుకుని 150 మంది మిగిలి ఉన్నారని తెలిపారు. 21 రోజుల్లో స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేసి దివ్యాంగులకు యూ డి ఐ డి కార్డ్స్ మంజూరు చేస్తామన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న 85 మందికి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షించి పోర్టల్ లో డేటా ఎంట్రీ చేసి యు డి ఐ డి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక, వైకల్య శాతాన్ని గుర్తించి తాత్కాలిక వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుని వైద్య నిపుణులతో చికిత్సలు అందిస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి సౌకర్యాలు అవసరమో వాటిని సమకూర్చి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన వసతులతో  రోగులకు  సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.ఈ డాక్టర్ సునీత, డాక్టర్ శివ దయాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి