ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు...

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు...

చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 17 ( ప్రజాస్వరం) :

చిన్న శంకరంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలలో మునిగితేలారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు చిన్న శంకర్ మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం జరిగిందని రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ధనికల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాలలోపే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వారు మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కెసిఆర్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కెసిఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మకం ప్రజల్లో ఎక్కువైందని రాబోయే రోజుల్లో మళ్లీ కెసిఆర్ సీఎం కావడం ఖాయమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, చిన్న శంకరంపేట సొసైటీ మాజీ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమ వెంకటేశం, లక్ష్మారెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీనివాస్, ఏమ చంద్రం, స్వామి రాజ్, ప్రభాకర్, గంగమ్మ, నవీన్, చంద్రయ్య, యాదగిరి, రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు,