ఉంగరం గుర్తుకు ఓటు వేసి 12 వార్డు అభివృద్ధికి భాగస్వామ్యంకండి...
మోత్కు మానస దుర్గ ప్రసాద్....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 05 (ప్రజాస్వరం ):
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో 12 వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని అభ్యర్థి మోత్కు మానస దుర్గ ప్రసాద్ కోరారు. 12 వ వార్డులో గత పాలకుల హయాంలో పేద బడుగు వర్గాలకు ఎలాంటి మేలు జరగలేదని అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. వార్డులో మౌళిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తానని, వార్డు అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Latest News
17 Feb 2026 16:06:02
తూప్రాన్, ఫిబ్రవరి 17( ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 72వ జన్మదిన...


