ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు....

ఘనంగా కేసీఆర్  జన్మదిన వేడుకలు....

జగదేవ్ పూర్ ,ఫిబ్రవరి17, (ప్రజాస్వరం):

 

జగదేవపూర్ మండలం ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ దీన రాజలింగం ,మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అలాగే పిల్లలకు కార్పొట్స్ అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేసీఆర్ ను తెలంగాణ అభివృద్ధిలో మార్పు చూపిన ఉద్యమ నాయకుడిగా, రైతులకు రైతుబంధుతో అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు యాదగిరి, స్వామి, యువకులు నవీన్, బిట్టు, అశోక్, అనిల్ ,ప్రవీణ్, భాను, హేమంత్, ఐలయ్య, పర్వతాలు, గణేష్, ,తదితరులు పాల్గొన్నారు.