గోవిందపూర్, కోనాపూర్ గ్రామాలలో కుక్కల దాడి...
ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు
దౌల్తాబాద్, ఫిబ్రవరి 04( ప్రజాస్వరం):
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందపూర్, కోనాపూర్ గ్రామాల్లో వేర్వేరు చోట్ల కుక్కల దాడికి గురైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌కు తరలించబడ్డారు.
గోవిందపూర్‌లోని 3 ఏళ్ల అద్విక ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కుక్క దాడి చేసింది. అలాగే, కోనాపూర్ గ్రామానికి చెందిన మనోజ్ అనే విద్యార్థి ప్రతిరోజు మాదిరిగానే బుధవారం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్తుండగా, శేర్ పల్లి బందారం గ్రామ శివారులోని ముండ చింత వద్ద కుక్క దాడి చేయగా మనోజ్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
స్నేహితులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, దౌల్తాబాద్ 108 సిబ్బంది, మెడికల్ టెక్నీషియన్ భాను ప్రకాష్, పైలట్ డి. నర్సింలు సంఘటన స్థలానికి వేరువేరుగా చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. తర్వాత ఇద్దరు చిన్నారులను స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గజ్వేల్‌కు తరలించబడింది.
ప్రస్తుతానికి చిన్నారి పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యులు అవసరమైన చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.


