తూప్రాన్ లో కెసిఆర్ 72 వ జన్మదిన సంబురాలు....
తూప్రాన్, ఫిబ్రవరి 17( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రజని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ..కేసీఆర్ తెలంగాణ ప్రధాత కాళేశ్వర నిర్మాత త్రాగునీటి దాత అభివృద్ధి వారధి సంక్షేమ సారథి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతిరూపం తెలంగాణ ప్రగతికి దారిదీపం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వెరువని గుండె ధైర్యం ప్రజల కోసం ఎందాకైనా కొట్లాడే తెలంగాణ నాయకుడి కల్వకుంట్ల చంద్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు .... సంపూర్ణ ఆరోగ్యంతో చీకట్లను చీల్చుకుంటూ పూర్ణ చంద్రుని వెలుగులా తన ఖ్యాతి దశదిశలా వ్యాపించాలని ఆమె కోరారు ......
తెలంగాణ జాతి పిత, తెలంగాణ తొలి ముఖ్య మంత్రి గౌరవ కేసీఆర్ జన్మదినం సందర్బంగా తూప్రాన్ మున్సిపాలిటీ లొ ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించిన గౌరవ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ . ఈ కార్యక్రమం లొ పాల్గొన్న వైస్ చైర్మన్ శ్రీమతి కొక్కొండ సమత కాశిరెడ్డి, కౌన్సిలర్లు సత్యలింగం, ఐలేష్ యాదవ్, రాధిక శ్రీనివాస్, చెలిమేల రాములు, జైపాల్ రాథోడ్, మునిరాతి లక్ష్మి మల్లేష్ మరియు మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మైనారిటీ లీడర్ సత్తార్ బాయ్, బుక్క విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్,ఏర్పల బాల్ రాజ్,బాబు రామ్ ప్రసాద్,కోటేష్,నర్సింగరావు,నాగేందర్ రెడ్డి,ఆంజనేయులు,నర్సింహ రెడ్డి,శాస నాగేందర్, సముద్రాల బాబు,శ్రవణ్,భాను మరియు బి. అర్. ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


