కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బృందానికి వివరాలు అందించాలి : జిల్లా కలెక్టర్ కే. హైమావతి
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బృందానికి వివరాలు అందించాలి : జిల్లా కలెక్టర్ కే. హైమావతి
సిద్దిపేట (ప్రజాస్వరం) :
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పథకాల పరిశీలనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జోసెఫ్ , వినోద్ ల నేతృత్వంలో జిల్లాకు వచ్చిన బృందం సభ్యులకు అండ జేసే అంశాలపై సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కే. హైమావతి తో సమావేశమై జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన వివిధ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ పంపించిన బృందం నేటి నుండి ఈ నెల 24వ తేదీ వరకు జిల్లాలోని బెజ్జంకి, అక్కన్నపేట, కొమరవెల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంఎన్ఆర్ఇజిఎస్, పింఛన్లు, వాటర్ షెడ్, గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్ యోజన, గ్రామపంచాయతీలు, అర్సేటి తదితర 12 రకాల పథకాల అమలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ గ్రామీణభివృద్ధి శాఖకు అందజేస్తారని అన్నారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీవోలు సంబంధిత ఇతర అధికారులు అందుబాటులో ఉండి జిల్లాలో అమలవుతున్న సంబంధిత పథకాలను క్షేత్రస్థాయిలో చూపించి వివరాలను అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ అమీద్, డిఆర్దీవో జయదేవ్ ఆర్య, పీడీ హౌసింగ్ దామోదర్ రావు, ఎల్డిఎం హరిబాబు, పంచాయతీరాజ్ ఇఇ లు చిరంజీవి, శ్రీనివాస్ రెడ్డి, డీపీఓ దేవకీదేవి, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిఆర్దీవో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.