ఉచిత బస్సు ప్రయాణంతో డ్రాప్ అవుట్ శాతం పెరిగింది : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మహాలక్ష్మి పథకం మహిళలకు ఒక వరం...
ఉచిత ప్రయాణంతో బాలికల డ్రాప్ ఔట్ శాతం తగ్గింది...
మహిళల బస్ ప్రయాణం గణనీయంగా పెరిగింది.
మెదక్ డిపో 2 కోట్ల మేలు రాయి చేరింది..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
మెదక్ జూలై 23 (ప్రజా స్వరం)
ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళలకు ఒక వరం అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆర్టీసీ మహాలక్ష్మి పథకం లో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అయిన సందర్భంగా ఆర్టీసీ సంబరాలను బుధవారం మెదక్ బస్ స్టాప్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్న లబ్ధి పొందుతున్న మహిళలను ఆయన సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత బస్ ప్రయాణం మహాలక్ష్మి పథకం తో మహిళలు తమకు అయ్యే ప్రయాణ ఖర్చులను అదా అయిన డబ్బులను వారి కుటుంబం అవసరాలకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు చేసినప్పటి నుండి మహిళల ప్రయాణ శాతం కూడా పెరిగిందని అన్నారు. గతంలో ఆర్టీసీ లో కుటుంబం మొత్తం ప్రయాణం చేయాలంటే కుటుంబానికి ఆర్థిక భారం అవుతుందని మహిళలు ప్రయాణాన్ని విరమించుకునే వారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో ఆడపిల్లలు చదువు కోవాలంటే 10 పదవ తరగతి చదివి ఆపేసే వారు ఎందుకంటే వేరే దగ్గరికి ప్రయాణం చేసి వెళితే ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని కుటుంబ సభ్యులు భావించే వారని కానీ ఇప్పుడు డ్రాప్ ఔట్ శాతం తగ్గిందని అన్నారు. ఉచిత ప్రయాణం తో చదువు కొనే యువత కు బాగా ఉపయోగపడిందని అన్నారు. మన మెదక్ డిపో లో కూడా ఉచిత బస్ ప్రయాణంతో 2 కోట్ల రూపాయల ఖర్చు చేసిన మేలు రాయి చేరడం జరిగిందని అన్నారు. ఈ మహాలక్ష్మి పథకం లో ఆర్టీసీ సిబ్బంది కృషి ఉందనీ, ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ డిపో కు కొత్తగా 8 బస్ లు రావడం జరిగిందని, కొత్త గా మరిన్ని ఆర్టీసీ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ఆర్టీసీ నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, డిపో అసిస్టెంట్ మేనేజర్ వీర బాబు, ఆర్టీసీ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.