మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
తూప్రాన్ , జూలై 24, ప్రజాస్వరం:
మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్ధుంపూర్ శివారులో గత రెండు రోజుల క్రితం ఓ యువకుడిని కొట్టి హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందుతులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ బోరబండకు చెందిన మహమ్మద్ సబీల్ (21) కార్ డెంటింగ్ దుకాణంలో పనిచేసేవాడు.అదే షాప్ ఓనర్ దగ్గరి బందువుల అమ్మాయిని ప్రేమించి నెల రోజుల క్రితం పెళ్ళిచేసుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయి తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకుని కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని వారికి నచ్చజెప్పి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు.అమ్మాయి మైనర్ కావడం తో ఎక్కడ తనకిచ్చి పెళ్లి చెయ్యారో అని అప్పటినుండి సబీల్ అమ్మాయికి అన్న వరుస అయినటువంటి హైదరాబాద్ బోరబండ కు చెందిన మహమ్మద్ అప్సర్ (ప్రస్తుతం సంగారెడ్డి లో ఉంటున్నడు.) కు ఫోన్ చేసి మీ బాబాయి కూతురు నాతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆమెకు నాతో పెళ్ళి చేయకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.అప్పటి నుండి అప్సర్ ఫోటోలను డిలిట్ చేయమని ఎంత చెప్పిన సబీల్ వినకపోవడంతో తనను చంపేస్తేనే అందరికి మనశ్శాంతి ఉంటుందని పధకం ప్రకారం రెండు రోజుల క్రితం అప్సర్ తన స్నేహితుడు అయినటువంటి సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సారోల్ల సంతోష్ తో కలిసి హైదారాబాద్ వెళ్ళాడు. సబీల్ కు ఫోన్ చేసి మాట్లాడానికి రమ్మని పిలిచి కారులో మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్ధుంపూర్ గ్రామాశివారులోకి తీసుకొచ్చి సబీల్ ఫోన్ లో ఉన్న అప్సర్ బాబాయి కూతురు ఫోటోలను డిలిట్ చేయమని ఎంత చెప్పిన వినకపోవడంతో అప్సర్,సంతోష్ లు ఇద్దరు కలిసి సబీల్ తో గొడవ పడి తలను పక్కన ఉన్న ప్రీకాస్ట్ గోడకు బలంగా కొట్టడు దీంతో తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. పక్కనే ఉన్న బండరాయితో సబీల్ తల పై మొఖం పై కొట్టి చనిపోయాడని నిర్ధారణ చేసుకుని పారిపోయారు.మక్దూంపూర్ సెక్రటరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టగా గురువారం తూప్రాన్ సిఐ రంగక్రిష్ణ,శివంపేట ఎస్సై తూప్రాన్ టోల్గేట్ వద్ద అప్సర్, సంతోష్ లను పట్టుకుని విచారించగా సబీల్ ను చంపినట్లు ఒప్పుకున్నారన్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న ఒక స్విఫ్ట్ కారు,రెండు ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించనున్నట్లు తూప్రాన్ డిఎస్సి నరేందర్ గౌడ్ తెలిపారు