ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వించిన
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
రామాయంపేట. 24.( ప్రజా సర్వం)
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథి హాజరై కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మరి విడత ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ పురాణ నిర్మాణంలో పాలుపంచుకున్న కేటీఆర్ అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు కేటీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, బసనపల్లి రాజు యాదవ్, ఉమామహేశ్వర్, సుభాష్ నాయక్, ఎస్కే హైమద్, కన్నపురం కృష్ణ గౌడ్, కాట్రియాల రాజేందర్ గుప్తా, బిక్షపతి, బోయిని స్వామి,నవాత్ మహేష్, భూమ మల్లేశం, పోచమ్మల ఐలయ్య, మాజీ సర్పంచ్ ప్రభావతి, శ్రీకాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు