మెదక్ కు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు రాక

మెదక్ కు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు రాక

మెదక్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక....
భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి... 

జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్...

Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)

Read More సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే

నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మొదటి సారిగా మెదక్ కు రానున్నట్లు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. గురువారం 
మెదక్ జిల్లా బిజేపి జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న మెదక్ జిల్లాలో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మొదట నర్సాపూర్ నుంచి కౌడిపల్లి, కొల్చారం మీదుగా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంబోజి పల్లి చౌరస్తా నుండి సాయి బాలాజీ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ  నిర్వహించిన్నట్లు తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని శ్రీ సాయిబాలజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ఎన్ రెడ్డి, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, కాశీనాథ్, మండల అధ్యక్షరాలు బెండ వీణ తదితరులు పాల్గొన్నారు.

Read More వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు