రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మెదక్ / చేగుంట
(ప్రజా స్వరం) :
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దిశల వారిగా నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అబండాలు సృష్టిస్తున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని ప్రజలకు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని ప్రజల పాలనలో ప్రజలకు మేలు అయ్యో సంక్షేమాలు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 23వేల కోట్లతో రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. నీళ్లు నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పి మోసం చేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుమార్చారన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టుతోనే సాగు నీరు తాగు నీరు అందిందన్నారు. పేదల కుడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేసి, కొత్త వ్యక్తులకు రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ఇళ్లులేని పేదలకు ఇండ్లు ఇందిరమ్మ పేరుతో ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరయ్యాయని మరో 3500 వందల ఇండ్లు మంజూకు ప్రభుత్వం కంకనం కట్టుకుందన్నారు. విద్యా వైద్యం చౌకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, దుబ్బాక, నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్డులు చెరుకు శ్రీనివాన్రెడ్డి, ఆవుల రాజీరెడ్డి, రాష్ట్ర నాయకులు సుప్రబాతరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.