బీజేపీ తోనే వికసిత్ తెలంగాణ నిర్మాణం సాద్యం  : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు  

బీజేపీ తోనే వికసిత్ తెలంగాణ నిర్మాణం సాద్యం  : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు  

* బీజేపీ తోనే వికసిత్ తెలంగాణ నిర్మాణం సాద్యం  : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు  
* నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బీజేపీ  జెండా ఎగరాలి.
* ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి
* కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ఉద్యమించాలి

నల్లగొండ / హైదరాబాద్  (ప్రజాస్వరం) : 
 
భారతీయ జనతా పార్టీ  బలోపేతం కోసం కృషి చేయాలని తెలంగాణలో బీజేపీ  ప్రభుత్వం రావాలని ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని  ఈ రోజు కార్యకర్తలు, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహమే దీనికి నిదర్శనని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు అన్నారు.  చౌటుప్పల్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన స్వాగతసభలో   ఎన్. రాంచందర్ రావు   మాట్లాడుతూ .తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా తొలి పర్యటనను నల్లగొండ జిల్లాలో చేయడం  నేను పుట్టిన జిల్లా ఇదే కావడంతో ప్రత్యేక పర్యటనగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బీజేపీ  జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, విద్యార్థులను మోసం చేసిందని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో పాటు పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోందని అన్నారు.  ప్రజలు ‘ఎందుకు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నాం’ అని  బాధపడుతున్నారన్నారు.బీజేపీ మాత్రమే బంగారు తెలంగాణ మారుస్తుందని ప్రజాస్వామిక తెలంగాణ, వికసిత్ తెలంగాణ ను నిర్మించగలదని అన్నారు.  రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషిచేయాలని రాంచంద్రార్ రావు పిలుపునిచ్చారు. 

Read More కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ