యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు

సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు
* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్
* సర్కిళ్ల లో ₹ 3.6 కోట్లతో ఐదు విగ్రహాలు
* యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
యాదగిరిగుట్ట జూలై 19 (ప్రజాస్వరం) 
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విద్యుత్తు అవసరాల నిమిత్తం దాదాపు 20 కోట్ల రూపాయల అంచనా నాలుగు మెఘావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయదలచామని  దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ .వెంకట్రావు తెలిపారు. సాంప్రదాయ ఇంధన వనరుల సంస్థ ఇప్పటికే ఈ డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ను పూర్తి చేసిందని ,వచ్చే బడ్జెట్లో దీనిని చేరుస్తామని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్న వించనున్నట్లు ఆయన  తెలిపారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏటా దేవస్థానానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల విద్యుత్తు బిల్లు వస్తున్నప్పటికీ, తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. కరెంట్ పోయిన పది సెకండ్ల లో విద్యుత్ సరఫరా వచ్చే విధంగా ఆలోచిస్తున్నా మన్నారు. భక్తులలో మరింత ఆధ్యాత్మిక చింతన కలిగించే విధంగా దేవస్థానం పక్షాన  " యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రిక" ,అదేవిధంగా టెలివిజన్ "భక్తి ఛానల్" ను ఏర్పాటు చేయనున్నా మన్నారు. ఈ విషయంలో డిపిఆర్ తయారీని ఒక కంపెనీకి ఇవ్వడం జరుగుతుందన్నారు .

రూ. 3.6 కోట్లతో విగ్రహాలు.... 
 కొండ కింద గిరి ప్రదక్షణ మార్గంలో వచ్చే ఐదు సర్కిళ్లలో ఏర్పాటు చేయదలచిన ఆంజనేయ స్వామి, గరుడ, రామానుజ ,ప్రహ్లాద, యాద ఋషి విగ్రహాల స్థాపనకు 3.6 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు..ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా దాతలను ఆహ్వానిస్తున్నామన్నారు.

Read More కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

సత్యనారాయణ స్వామీ వ్రతాల నిర్వహణ టికెట్ 1000 రూపాయలకు పెంపు... 
దేవాలయానికి ఎదురుగా వాహన పూజల కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు కార్య నిర్వహణ అధికారి ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతినిత్యం దేవస్థానంలో భక్తులు జరిపించుకునే సత్యనారాయణ స్వామీ వ్రతాల నిర్వహణ టికెట్ రుసుమును ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు .ఈ పెంపుదల వలన వచ్చే  200 రూపాయల అదనపు ఆదాయాన్ని భక్తులకే తిరిగి ఖర్చు చేస్తామన్నారు. అంగవస్త్రము, ప్రసాదంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను అందజేయదల్చామన్నారు .
భద్రతకు మరో 50 మంది సెక్యూరిటీ, దేవస్థానం భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్ రావు తెలిపారు. మరో 50 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకునేందుకు పేరెన్నికగన్న ప్రైవేట్ భద్రత సంస్థల నుంచి ఒక సంవత్సరం కాల పరిమితికి టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ నరసింహమూర్తి పాల్గొన్నారు.

Read More జాతీయ బాష హిందీ కాదు : కేటీఆర్

 

Read More కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తా : కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హలో