మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ లో చేరిన మైనార్టీ నాయకులు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ లో చేరిన మైనార్టీ నాయకులు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో
బీజేపీ లో చేరిన మైనార్టీ నాయకులు

 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా
 పనిచేయాలి : ఎంపీ రఘునందన్ రావు 
 

Read More అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

గజ్వేల్ / వర్గల్
 (ప్రజాస్వరం) :

Read More వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు

 రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే అన్ని స్థానాల్లో గెలుపొందుతారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.వర్గల్ మండల బీజేపీ అధ్యక్షులు   తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో   ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పలువురు బీజేపీ లో చేరారు. ఎంపీ రఘునందన్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషి చేయాలని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాడని ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న కాలంలో రాష్ట్రంలో కూడా  బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీజేపీ లో చేరిన వారిలో సయ్యద్ షాబాద్, సయ్యద్ అవాజ్ అలీ, సయ్యద్ ఓమర్, సయ్యద్ మసి లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, సీతారాం పల్లి బూత్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read More బోనం ఎత్తిన మెదక్ క్షలెక్టర్ దంపతులు