నిరుపేద కుటుంబానికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆర్థిక సాయం
నిరుపేద కుటుంబానికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆర్థిక సాయం
బొల్లారం, జనవరి 2 (ప్రజా స్వరం)
జిహెచ్ఎంసి డివిజన్ 272 పరిధిలోని బొల్లారం ఐడిఏ బస్తికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి స్థానిక బీజేపీ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అండగా నిలిచారు.
ఐడిఏ బస్తికి చెందిన వడ్డెర సుజాత (45) అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందారు. కూలీపై ఆధారపడే ఈ కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బస్తివాసులు డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డిని సంప్రదించి సాయం చేయాలని కోరారు.
వారి విజ్ఞప్తికి స్పందించిన ఆనంద్ కృష్ణారెడ్డి వెంటనే బస్తికి చేరుకుని మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తన వంతుగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించారు.
తక్షణమే స్పందించి పేద కుటుంబానికి అండగా నిలిచిన కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


