సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి. : మెదక్ ఆర్డీవో రమాదేవి..
యూరియా నిల్వల గురించి డిస్ప్లే ఉండాలి.
సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి.
కొరత సృష్టిస్తే కఠిన చర్యలు...
రైతు ఫోన్ నెంబర్ తో సహా అమ్మకాల వివరాలు ఉండాలి.
మెదక్ ఆర్డీవో రమాదేవి..
మెదక్ జూలై 23 (ప్రజా స్వరం)
జిల్లా లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని అనవసరంగా కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా ఆర్డీవో రమాదేవి సందర్శించారు
షాప్ ముందు పెట్టిన యూరియా నిల్వల బోర్డు ను ఆర్డీవో రమాదేవి ముందుగా పరిశీలించి, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు యూరియా అమ్మారు? ఏ విధంగా అమ్మకాల ప్రక్రియ జరుగుతుంది, వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారు అని షాప్ యాజమాన్యం ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం లో ఉన్న స్థాక్ ని ఆర్డిఓ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ జిల్లా లో ఎలాంటి యూరియా కొరత లేదని అనవసరం గా కొరత సృష్టి స్తే ఉపేక్షించేది లేదన్నారు. పక్కాగా అమ్మకాలు జరగాలని ఏ రైతుకు ఎంత అమ్ముతున్నారో వారి ఫోన్ నెంబర్ తో సహా అన్ని వివరాలను నమోదు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇతర పోలీసు అధికారులు, అగ్రికల్చర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.